ఈమధ్యనే ఎన్నో రోజుల నుండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ బెయిల్ ను వెంటనే రద్దు చేయాలి అంటూ మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత సుప్రీమ్ కోర్ట్ మెట్లు ఎక్కారు. తన తండ్రి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉందన్న కారణంతో మొదటి నుండి ఆయనకు వ్యతిరేకంగా సిబిఐకి సహకరిస్తూ వస్తోంది. ఇక ఆయనకు ఇటీవల బెయిల్ దొరకడంతో శాంతించని సునీత బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ లో ఈమె అవినాష్ రెడ్డి పై మోపిన అభియోగాలు అన్నీ కూడా కీలకంగా ఉన్నాయి, అందుకే తక్షణమే ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ లో పేర్కొంది.అంతే కాకుండా ఈ విషయాన్నీ హై కోర్ట్ సరిగా పరిశీలించకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని కూడా చెప్పడం గమనార్హం. అయితే రేపు ఈ పిటీషన్ సుప్రీం కోర్ట్ వెకేషన్ బెంచ్ ముందుకు వెళుతుంది.