Movies

ఫాన్స్ నా దేవుళ్లు అంటున్నా అమితాబ్ బచ్చన్….

ఫాన్స్ నా దేవుళ్లు అంటున్నా  అమితాబ్ బచ్చన్….

అమితాబ్ కు నేష‌న‌ల్ వైడ్ గా భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. అభిమానులు అమితాబ్ పై అంత ప్రేమ‌ను చూపిస్తారో.. అంతకంటే ఎక్కువ ప్రేమ అమితాబ్ కు వారిపై ఉంది. ఇక అమితాబ్ ను ఒక్కసారైనా చూడాలని ఎంతో మంది ఆశతో ఉంటారు. ఈ క్ర‌మంలోనే అమితాబ్‌ బచ్చన్ ను చూసేందుకు ప్రతీ ఆదివారం ముంబైని ఆయన స్వగృహం జల్సా వద్ద వేలాదిగా అభిమానులు వ‌స్తుంటారు. వారి కోసం అభితాబ్ ప్ర‌తి ఆదివారం తన ఇంటి బాల్కనీలో కొద్ది సేపు నిల్చొంచాడు. అభిమానులకు అభివాదం చేసి వెళ్లి పోతారు.

ఈ ఆనవాయితీని అమితాబ్ గ‌త 50 ఏళ్ల నుంచి మిస్ అవ్వ‌కుండా పాటిస్తున్నారు. త‌న అభిమానులను సంతోష పెడుతున్నారు. అంతేకాదు, అభిమానుల‌కు అభివాదం చేసే స‌మ‌యంలో అమితాబ్‌ బచ్చన్ కాళ్ల‌కు చెప్పులు కూడా వేసుకోరు. దీని వెన‌క అమితాబ్ కార‌ణాన్ని కూడా వెల్ల‌డించారు. `గుడికి వెళ్లినప్పుడు మనం చెప్పులను బయటే విడిచివెళ్తాం.. ప్రతీ ఆదివారం నా ఇంటి ప్రాంగణం నాకు ఓ దేవాలయంలా కనిపిస్తుంది.అభిమానులు దేవుళ్ల మాదిరిగా దర్శనమిస్తారు. అందుకే చెప్పులు ధ‌రించ‌ను` అంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో అమితాబ్ అభిమానులకు ఎంత‌టి గౌర‌వాన్ని ఇస్తారో స్ప‌ష్టంగా తేలిపోయింది.