Politics

వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ పరీక్షకు కోర్టు అనుమతి….

వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ పరీక్షకు కోర్టు  అనుమతి….

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ టెస్టు జరిపేందుకు సీబీఐ కోర్టు నేడు అనుమతి మంజూరు చేసింది.హత్య స్థలంలో దొరికిన లేఖను సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడం తెలిసిందే. లేఖను 2021 ఫిబ్రవరి 11న సీబీఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. తీవ్ర ఒత్తిడితో వివేకా రాసిన లేఖగా సీఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది.లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ ను సీబీఐ కోరింది. అయితే, లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్ హైడ్రిన్ పరీక్ష జరపాల్సి ఉంటుందని ఫోరెన్సిక్ ల్యాబ్ సీబీఐకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు.దీంతో రికార్డుల్లో కలర్ జిరాక్స్ అనుమతించాలని కోర్టుకు CBI విజ్ఞప్తి చేసింది.