Agriculture

వ్యవసాయదారులుకు కేంద్రం శుభవార్త….

వ్యవసాయదారులుకు కేంద్రం శుభవార్త….

ఖరీఫ్ పంటలపై కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పెసర పంటకు 10.4 శాతం, వేరుశెనగ 9 శాతం , నువ్వులు శాతం, వరి 7 శాతం, సోయాబీన్, రాగులు, జొన్న, పొద్దు తిరుగుడు పంటకలకు సుమారుగా 6-7 శాతం చొప్పున 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఎంఎస్పీని పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, సాగుదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వరి (సాధారణ) ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ. 143 పెంచి, రూ.2,183గా నిర్ణయించినట్లు తెలిపారు. గత సీజన్‌లో క్వింటాల్‌కు రూ.2,040 ఉంది. అంటే 7 శాతం పెంచారు. వరి ఎంఎస్‌పి (ఎ గ్రేడ్) క్వింటాల్‌కు రూ. 2,203గా నిర్ణయించబడింది, ఇది గతేడాది క్వింటాల్‌కు రూ. 2,060 ఉండేది. పెసరకు గతేడాది ఎంఎస్పీ క్వింటాల్ కి రూ. 7,755 ఉంటే ఈ ఏడాది రూ. 803 పెంచి, రూ. 8,558గా మద్దతు ధరను నిర్ణయించారు.