ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కోర్టులో బుధవారం కాల్పులు కలకలం జరిగింది. ముక్తార్ అన్సారి అనుచరుడు సంజీవ్ జీవను కోర్టులో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. విచారణ సమయంలో జడ్జి ఎదుటే కాల్పులు జరిగాయి. దాడికి పాల్పడిన వారు న్యాయవాదుల వేషం ధరించి కోర్టు ఆవరణలో ఈ నేరానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు ఓ బాలికకు కూడా గాయాలయ్యాయి. కోర్టులో 5 రౌండ్లలో నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.