Business

ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు స్తానం…

ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు స్తానం…

భారత్‌లో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు లభించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ముంబయి దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానాలు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పూణె ఉన్నాయని మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వెల్లడించింది. ప్రతి నగరంలో రవాణా, ఆహారం, దుస్తులు, వసతి, గృహోపకరణాలు, వినోదం వంటి 200 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితా తయారుచేశారు. అయిదు ఖండాల్లోని 227 నగరాల్లో ఈ సర్వేను జరిపారు. ఇందులో ప్రపంచం మొత్తంగా చూస్తే ఖరీదైన నగరాల్లో ముంబయికి 147వ స్థానం దక్కింది. ఆ తర్వాత ఢిల్లీకి 169, చెన్నై 184, బెంగళూరుకి 189, హైదరాబాద్ 202, కోల్‌కతా211, పుణె 213వ స్థానంలో నిలిచాయి.

ఇక అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్, సింగపూర్, జూరిచ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో హవానా, పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి. ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్‌కతాలో అత్యంత తక్కువగా వసతి ఖర్చులవుతున్నాయి. ఆసియాలోని అత్యంత ఖరీదైన అగ్రగామి 35 నగరాల్లో ముంబయి, ఢిల్లీ నిలిచాయి. ఆసియా నగరాల్లో ముంబయి స్థానం గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం తగ్గి 27వ స్థానానికి చేరింది.