ప్రజల ఆశీర్వాదంతో నిజామాబాద్ జిల్లా అంతటా గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ గులాబీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ కుటుంబం పెద్దది, కేసీఆర్ మనసు పెద్దది.. గులాబీ కండువా కప్పుకుంటే ప్రజలకు గులాంలాగా పని చేయాలన్నారు. గులాబీ కండువాపై అందరికీ నమ్మకం ఉండాలంటూ కార్యకర్తలకు సూచించారు. కొన్ని పార్టీలు, నాయకులు నినాదాలు చెప్తారు.. కానీ నిజం ఉండదు.. జవాన్లకు, కిసాన్లను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే మహాసముద్రని.. ఎవరూ ఏం చేయలేరంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 23శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని.. ఇప్పుడు తెలంగాణలో 66% ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఏం కావాలని.. ఎప్పుడూ సీఎం కేసీఆర్ ఆలోచిస్తునే ఉంటారంటూ పేర్కొన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు కేసీఆర్ అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.