Politics

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మాగుంట రాఘవకు బెయిల్‌….

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మాగుంట రాఘవకు బెయిల్‌….

ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనకు 15 రోజుల పాటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను ఫిబ్రవరి 10న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే.