NRI-NRT

దారుణంగా పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ …..

దారుణంగా పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ …..

పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్‌ జీడీపీ 3.5 శాతంగా నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్‌ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.

గత ఏడాది ఆగస్టులో భారీ వరదల కారణంగా దేశం మూడొంతులు నీట మునిగిపోయింది. దీంతో పాటు ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల విదేశీ మారకద్రవ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నిత్యావసర వస్తువులు ఉదాహరణకు ఆహారం, ఇంధనం, ఎరువులు, మందులు వాటికి చెల్లించడానికి కూడా విదేశీ మారకద్రవ్యం లేదా డాలర్లు లేకుండా పోయాయి. దేశంలోని పారిశ్రామికరంగం కుంటుపడింది. మార్చి 2023తో ముగిసిన ఏడాది కాలానికి పారిశ్రామిక ఉత్పత్తి 25 శాతం క్షీణించిందని వరల్డ్‌ బ్యాంకు మంగళవారం నాడు విడుదల చేసిన తాజా గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌ రిపోర్టులో పేర్కొంది.