Movies

ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియాంకా చోప్రా..?

ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియాంకా చోప్రా..?

ఇక కొర‌టాల శివ త‌ర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌. కొద్ది రోజుల క్రిత‌మే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందన్న టాక్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా బాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తేనే పాన్ ఇండియా లెవ‌ల్‌తో పాటు గ్లోబ‌ల్ వైడ్‌గా తిరుగులేని క్రేజ్ వ‌స్తుంద‌ని ప్రియాంక‌నే హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.ఇక, ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తైన తర్వాత తారక్‌.. ప్రశాంత్‌ నీల్‌ సినిమాని పట్టాలెక్కించనున్నారు. మరోవైపు, ప్రియాంక.. ఇటీవల ‘సిటడెల్‌’తో అలరించారు. త్వరలో దీనికి ప్రీక్వెల్‌ రానుంది.