త్వరలో 17వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా ములుగులో సాగునీటి దినోత్సవ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నాడు దాశరథి జైల్ గోడలమీద రాశారు. నేడు కేసీఆర్ తెలంగాణ కోటిరత్నాల వీణనేకాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని నిరూపించారని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మండు వేసవిలో ఏనాడైనా నీళ్ళు కనిపించాయా? తాగునీరు ఇవ్వక చావగొట్టి, సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతారు అంటూ కేటీఆర్ విమర్శించారు.