ఏపీ సీఎం జగన్ను క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన రాయుడు.. సీఎంతో కాసేపు ముచ్చటించారు.జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుంచి ఇంటికి బయలు దేరారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ను వెంటవెంటనే కలుస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. అయితే, అంబటి రాయుడు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.