వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవినాశ్ రెడ్డికి బెయిల్‌ను ఇవ్వడంపై వైఎస్ సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అభియోగాలను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు సీబీఐ విచారిస్తున్న ఏ కేసులో కూడా ముందస్తు బెయిల్ రాలేదని వైఎస్ సునీత అంటున్నారు. ఇక వైఎస్ సునీత పిటిషన్‌పై సీబీఐ తమ వాదనలను వినిపించనుంది. కాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మే31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.