NRI-NRT

తానా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం…

తానా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం…

ఉత్తర అమెరికాలోని అతిపెద్ద ఇండో-అమెరికన్ సంస్థ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ మహాసభ సమావేశాలు జూలై 7,8,9 వ తేదీల్లో జరగనున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెల్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం తానా కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక 23వ మహాసభ సమావేశాలను పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభగల వారిని ప్రోత్సహించి అవార్డులతో ఘనంగా సత్కరించే మహోన్నత కార్యక్రమానికి మహాసభల తానా అవార్డ్స్ కమిటి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ‘తానా అవార్డ్స్ ఫర్‌ ఎక్సలెన్స్‌’ పేరిట పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సత్కరించనున్నారు. ఈక్రమంలో అర్హులైన వారు, అలాగే మీకు అర్హులు అనిపించే వారి పేర్లను ప్రతిపాదించాలని తానా అవార్డ్స్‌ కమిటీ కోరింది.

అర్హులకు తగిన గౌరవ సత్కారాలు దక్కేలాగా సిఫార్సు చేయడానికి వారి పూర్తి వివరాలు ఇంగ్లిష్‌ లేదా తెలుగులో కానీ క్షుణంగా రాసి, ఫొటో జతపరిచి awards@tanaconference.org కు ఈమెయిల్‌ పంపాలి. ఎంట్రీల కోసం జూన్ 10వ తేదీని ఆఖరి గడువుగా తెలిపారు