ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. సినీ సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత నైటింగేల్‌గా పిలిచే పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర తానా మహాసభలకు రానున్నారు.
ఇంకేందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి చిత్ర పాటల గానాన్ని వినండి. మహాసభల కోసం మీ పేర్లను https://tanaconference.org/event-registration.html లింక్ ద్వారా మీ పేర్లను రిజిష్టర్ చేసుకోండి.