మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయకుమార్ రెడ్డిల రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం వారి రిమాండ్‌ను ఈనెల 16 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది