ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఈటల హుటా హుటీన హస్తినకు పయనమయ్యారు. ఈటల నేడు అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఐతే ఈ సమావేశంలో ఈటలతో పార్టీ పెద్ద ఏం చర్చిస్తారనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
మరోవైపు ఈటలకు కీలక పదవి ఇవ్వబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర బీజేపీ చీప్ బండి సంజయ్‌ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఈటల సంతృప్తిగా లేరని, పదవి తప్ప, అధికారం లేదని ఆయన భావిస్తున్నట్టు బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.