Politics

మాగుంట రాఘవ బెయిల్ 5 రోజులకు కుదింపు….

మాగుంట రాఘవ బెయిల్ 5 రోజులకు కుదింపు….

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మాగుంట రాఘవ్‌ బెయిల్‌ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు కుదించింది. ఈనెల 12న స్థానిక కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.