జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దైవబలం కోసం హోమం చేయబోతున్నారు. మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో జనసేన అధినేత పవన్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14 నుండి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. అంతకంటే ముందు తన యాత్రకు దైవబలం కూడా తోడయ్యేందుకు హోమం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 13న మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో హోమాన్ని నిర్వహించనున్నారు. హోమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.