Politics

పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంది అని రేవంత్ రెడ్డి వ్యాక్యాలు….

పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంది అని రేవంత్ రెడ్డి వ్యాక్యాలు….

లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టాలన్న సీఎం కేసీఆర్ కుట్రలో భాగమే ధరణి పోర్టల్ అని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్ లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామన్నారు. స్వయంగా తన భూమి రికార్డులను చెప్పడం లేదని ఆగ్రహించారు.

ధరణి రద్దు చేస్తే రైతుబంధు రద్దవుతుందని కేసిఆర్ అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయన్న రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి అవకాశం ఉందని వెల్లడించారు.