Kids

TSPSC పేపర్ల లీకేజీ కేసులో సిట్ ఛార్జీషీట్…

TSPSC పేపర్ల లీకేజీ కేసులో సిట్ ఛార్జీషీట్…

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు 49 మందిని సిట్‌ అధికారులు అరెస్టు చేయగా.. వీరిలో 16మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్‌ 8మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.