Sports

డిస్నీ హాట్ స్టార్ లో వన్డే వరల్డ్ కప్ ఉచితంగా వీక్షించే అవకాశం….

Auto Draft

డిస్నీ హాట్ స్టార్ ప్ల‌స్ లో ఆసియా క‌ప్ తో పాటు.. పురుషుల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీల‌ను లైవ్ టెలికాస్ట్ చేయ‌నున్నారు. ఇంకొక విష‌యం ఏంటంటే ఇది పూర్తిగా ఉచితం..క్రికెట్ మజాను వీలైనంత మంది ఎక్కువ మొబైల్ యూజర్లకు చేరువ చేయడమే తమ లక్ష్యం అని డిస్నీ హాట్ స్టార్ ప్లస్ వెల్లడించింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ జరగనుండగా, అక్టోబరు 5 నుంచి 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. డిస్నీ హాట్ స్టార్ నిర్ణయంతో భారత్ లో 54 కోట్ల మంది స్మార్ట్ ఫోన్/ట్యాబ్ యూజర్లు ఉచితంగా క్రికెట్ ప్రసారాలను వీక్షించే అవకాశం కలుగుతుంది..గత కొంతకాలంగా ఓటీటీ వేదికలు క్రీడా ప్రసారాలకు కూడా సై అంటున్న సంగ‌తి తెలిసిందే.