వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టిపారేసింది. వైఎస్ సునీత, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ను నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే జరిగే పరిణామాలను స్పష్టంగా కోర్టుకు వివరించారు. దీంతో సీబీఐ, సునీత వాదనలలో మెరిట్స్ ఉండటంతో బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నాంపల్లి సీబీఐ కోర్టు.