WorldWonders

తవ్వకాల్లో బయటపడ్డ 10 వేల ఏళ్లనాటి శివుడి త్రిశూలం….

తవ్వకాల్లో బయటపడ్డ 10 వేల ఏళ్లనాటి శివుడి త్రిశూలం….

10 వేల ఏళ్ల నాటి త్రిశూలం, 3 వేల ఏళ్ల కిందటి వజ్రాయుధాన్ని కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ శామీర్ హుస్సేన్ బెంగళూరులోని ప్రెస్​ క్లబ్​లో ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ 2015 మే నెలలో ఫిలిప్పిన్స్​ మైనింగ్ తవ్వకాలల్లో ఈ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయి. ​2012 నుంచి ఫిలిప్పిన్స్ కాపర్, గోల్డ్ మైనింగ్​ల్లో నేను భాగస్వామిని. వ్యాపార రీత్యా నేను నా సమయాన్ని ఫిలిప్పిన్స్​లోనే ఎక్కువగా గడుపుతుంటాను. అలాగే అక్కడి పౌరులతో కలిసి పనిచేయడం వల్ల వారితో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2015 మే 5వ తేదీన మైనింగ్ సూపర్​వైజర్​.. తాను మునుపెన్నడూ చూడని వస్తువులు తవ్వకాలలో బయటపడ్డాయని తెలిపారు. వాటిని నీటితో శుభ్రం చేశాము. అందులో ఒకటి చూడడానికి దేవుడి విగ్రహం వలే ఉంది. ఇక రెండోది త్రిశూలంగా గుర్తించాము. అయితే ఈ రెండూ కూడా హిందు పురాణాలకు సంబంధించిన వస్తువులుగా నిర్ధరించాము. వాటిని ఇంటికి తీసుకెళ్లి వాటి ఫొటోలను నా స్నేహితులందరికీ పంపాను. వాటిపై పరిశోధన చేసిన తర్వాత ఇంటర్​నెట్​లో కూడా వెతికాను. అప్పుడు నాకు అర్థం అయ్యింది. త్రిశూలంతో పాటు దొరికిన మరో వస్తువు వజ్రాయుధం అని తెలిసింది. అది హిందూ పురాణాల్లో ఇంద్రభగవానుడి ఆయుధం, త్రిశూలం శివుడిది అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డాను. తర్వాత భారత్​కు వచ్చి పురావస్తు శాఖ వారిని సంప్రదించాను. పురావస్తు శాఖ మాజీ అధికారి అంజనీ మున్షీ వాటిని పురాతన వస్తువులుగా ఆమోదించారు’ అని అన్నారు.