Politics

నేడు విశాఖకు అమిత్‌ షా….

నేడు విశాఖకు  అమిత్‌ షా….

కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. చెన్నై నుంచి సాయంత్రం 5:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తిరిగి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.