Politics

మంత్రి రోజాకు అనారోగ్యం….

మంత్రి రోజాకు అనారోగ్యం….

మంత్రి రోజా అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని నివాసగృహంలో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో గడిపిన రోజా ఉన్నట్టుండి కాలి వాపు, నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స కోసం థౌజండ్‌ లైట్స్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సతో కాలు వాపు తగ్గిందని, ఆమె పూర్తిగా కోలుకొని త్వరలోనే డిశ్చార్జి అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.