పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అమలాపురం పోలీస్ డివిజన్ పరిధిలో ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు. వారాహి యాత్ర తొలి సభ కత్తిపూడిలో నిర్వహించనున్నారు.కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 28 వరకు వపన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు