ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది.అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే వాతావరణం మారిపోయింది. దాంతో ఆ ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆ విమానం పాక్ గగనతలంలోనే ఉండిపోయింది. లాహోర్ నగరానికి ఉత్తర దిక్కులో చక్కర్లు కొట్టింది. అనంతరం, వాతావరణం అనుకూలించడంతో గుజ్రన్ వాలా వద్ద తిరిగి భారత్ లోకి ప్రవేశించింది. శనివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.01 గంటల వరకు ఈ విమానం పాక్ గగనతలంలో ఉంది. అయితే ఈ ప్రక్రియ పాకిస్థాన్ విమానయాన అధికారుల అనుమతితోనే జరిగిందని ప్రకటనలో పేర్కొంది. పాక్ గగనతలంలోకి వెళ్లిన విమానం తిరిగి అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయ్యేంత వరకు అమృత్సర్ ఏటీసీ అధికారులు పాకిస్థాన్ అధికారులతో ఫోన్లో టచ్‌లోనే ఉన్నారని పేర్కొంది.