రాష్ట్ర చరిత్రను భావి తరాలకు తెలిపే విధంగా భారత్ జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆవిష్కరించారు. దాదాపు 20 కోట్ల ఏళ్లలో తెలంగాణలో కొనసాగిన పరిస్థితులు, పరిపాలన విధానాలు, నాటి దర్శనీకతను అర్థం చేసుకుంటే అవి రేపటి తరాలకి దారి చూపుతాయన్నారు. మన గత చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా, వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ తద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోగలమని సీఎం తెలిపారు.