ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఎండల కారణంగా పాఠశాల టైమింగ్స్‌లో మార్పులు చేశారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల జూన్ 12 రీ ఓపెన్ కానున్నాయి. అయితే వడగాల్పుల తీవ్రత ఏ మాత్రం తగ్గకపోవడంతో ఈ నెల(జూన) 17 వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించారు. అయితే తాజాగా.. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. భారీ ఉష్ణోగ్రతలు ఉన్నందున ఇప్పుడు స్కూల్స్ తెరవడమంటే విద్యార్థులకు ఇబ్బందేనని ఆయన మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు కనీసం వారం రోజుల పాటు సెలవులు పొడిగించాలని అన్నారు. కాగా దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమాచారం తెప్పించుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.