క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా క్రికెట్ పండుగ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్ లో ఈ మెగా టోర్ని జరుగనుంది. టోర్నీషెడ్యూల్‌ను బీసీసీఐ ఐసీసీ కి పంపింది. ప్రపంచకప్ ఆడే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను పంపించనుంది. ఆ దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న అనంతరం ఐసీసీ తుది షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది.
షెడ్యూల్‌ను పరిశీలిస్తే అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియా తో ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న భారత్ తలపడనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ప్రపంచకప్ లో టీమిండియా షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అనంతరం అక్టోబర్ 11న అఫ్గనిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ ఉంటుంది. అదేనెల 15న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుండగా.. 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్ జట్లతో తలపడనుంది. నవంబర్ 2న వరల్డ్ కప్‌లో క్వాలిఫైయర్ అయిన టీమ్‌తో ఆడనున్న భారత టీమ్.. 5న దక్షిణాఫ్రికాతో, 11 మళ్లీ క్వాలిఫయర్ టీమ్‌తో తలపడనుంది.