నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా బతకడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భయం భయంగా అన్ని వర్గాల ప్రజలు తమ జీవనాన్ని వెళ్లదీస్తున్నారని, అధికారంలో ఉండి ప్రజల అవసరాలను ఆకాంక్షలు నెరవేర్చక పోవడం దురదృష్టకరమన్నారు భట్టి విక్రమార్క. ప్రజల్లో ఉన్నవారికే, సర్వేల ద్వారా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలని ప్రతి నియోజకవర్గంలో నేతలు సిద్ధమవుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు లేవన్నారు.