Health

వేప కషాయం వల్ల ఎన్నో లాభాలు తెలుసా?

వేప కషాయం వల్ల  ఎన్నో లాభాలు తెలుసా?

వేప చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. గ్రామాల్లో, రోడ్ల ప‌క్క‌న‌, ఇళ్ల ముందు, దేవాల‌యాల్లో వేప చెట్టు మ‌న‌కు ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. వేప చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిలో ప్ర‌తి భాగం కూడా మ‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వేప చెట్టు గాలి కూడా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్ఫెక్ష‌న్ ల‌ను, ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మం మ‌రియు జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో ఈ వేపాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ వేపాకుల‌తో క‌షాయాన్ని చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. వేపాకుల‌తో క‌షాయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి… దీనిని ఎలా వాడాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా గుప్పెడు వేపాకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక వేపాకుల‌ను వేసి ఒక గ్లాస్ క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ క‌షాయాన్ని వ‌డ‌క‌ట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వేపాకు క‌షాయం త‌యార‌వుతుంది. ఈ క‌షాయాన్ని రోజూ ఉదయం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌లో ఉండే క్రిములు న‌శిస్తాయి. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శ‌రీరంలో రక్త‌ ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.

ర‌క్త‌శుద్ది కూడా అవుతుంది. ఈ క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల నోటి అల్స‌ర్లు త‌గ్గుతాయి. నోటిలో ఉండే క్రిములు నశించడంతో పాటు దంతాల‌, చిగుర్ల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. అలాగే నీటిలో వేపాకును వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. వేప ఆకులతో చేసిన క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపులు, నొప్పులు కూడా త‌గ్గుతాయి. ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. ఆస్థ‌మా వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈవిధంగా వేపాకుల క‌షాయం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంద‌ని దీనిని ప్ర‌తిరోజూ తాగడం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.