బీజేపీ అండ లేకపోయినా గెలుస్తానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. పిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంచేందుకు ఏర్పాటు చేసన కార్యక్రమంలో ఆయన రాజకీయంగా తన ఆవేదన చెప్పుకోవడానికే సమయం కేటాయించారు. ఎదురుగా ఉన్నది పిల్లలని.. తాను పెట్టింది రాజకీయసభ కాదనే స్పృహలో కూడా ఆయన లేరు. అదే పనిగా రాజకీయాల గురించి చెప్పుకుని.. తన ధైర్యం మీరేనని.. మీరే అండగా ఉండాలని ప్రజల్ని బతిమాలుకున్నారు.
అయితే ఆయన ఏడుపంతా,చంద్రబాబు, టీడీపీ మీదనే. వరుసగా రెండు రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు ఏపీకి వచ్చారు. ఓ రోజు జేపీ నడ్డా.. మరో రోజు అమిత్ షా వచ్చారు. ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడ్డారు. వారికి సమాధానం చెప్పే ధైర్యం మాత్రం జగన్ కు లేకుండా పోయింది. వారు చేసిన విమర్శలపై పల్తెత్తు మాట అనలేదు. ఇతర నేతలతో బూతులు తిట్టిస్తున్నారు కానీ.. తాను విమర్శించి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఆయన సైలెంట్ గా ఉన్నారు.
బీజేపీని పల్లెత్త మాట అనలేకపోయినా,చంద్రబాబును మాత్రం తిట్టాలనుకున్నంతగా తిట్టారు. రాయలసీమ డిక్లరేషన్.. ఎస్సీ డిక్లరేషన్ అంటున్నారని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ డిక్లరేషన్ల తేలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అండగా లేకపోవచ్చు..మీడియా సహకారం అందక పోవచ్చు..దత్తపుత్రుడు అండ దండలు లేకపోవచ్చు…కానీ నా దైర్యం మీరేనని.. చెప్పుకొచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేయరని చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించారు. ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని… ప్రతిపక్షాలన్ని పేదలపై పోరాటం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ తీరు రాను రాను కాడి దించేస్తున్నట్లుగా ఉండటంతో.. వైసీపీ నేతల్లోనూ నిరాశ పేరుకుపోతోంది. ప్రజల అసంతృప్తిని పట్టించుకోకుండా…అందర్నీ దూరం చేసుకుని.. ఇప్పుడు బీజేపీని కూడా దూరం చేసుకుని.. జగన్ ఏం సాధిస్తారని వారు తలలు పట్టుకుంటున్నారు.