మద్యం కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాగుంట రాఘవ తిహాడ్ జైలు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు లొంగిపోయాడు. రాఘవకు తొలుత దిల్లీ హైకోర్టు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మధ్యంతర బెయిల్ పరిమితి కుదించి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాగుంట రాఘవ ఈడీ అధికారులకు లొంగిపోయాడు.