పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి ఊరట లభించింది. కోర్టు హాజరు నుండి మినహాయింపును ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బాంబే హైకోర్టు పొడిగించింది. ఆగస్ట్ 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపును ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీకి చెందిన మహేశ్ 2021లో పరువు నష్టం కేసు వేశారు.