NRI-NRT

భారత్‌లో పాక్​ డ్రోన్ కూల్చివేత…..

భారత్‌లో పాక్​ డ్రోన్ కూల్చివేత…..

భారత్​ సరిహద్దులోని రెండు వేర్వేరు ఏరియాల్లోకి పాకిస్థాన్​ పంపించిన పలు డ్రోన్లను సరిహద్దు భద్రతా దళ జవాన్లు కూల్చివేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. . పంజాబ్​లోని తరణ్​తరణ్​ జిల్లాలో భారత సరిహద్దు రక్షణ దళ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పాక్​ డ్రోన్లపై పంజాబ్​ పోలీసులకు అందిన సమాచారం మేరకు జవాన్లు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో రాజోకి గ్రామ శివారులో డ్రోన్లు తిరుగుతున్నట్లు గమనించి వాటిని కూల్చేశారు. పొలంలో కూలిన వాటిని పరిశీలంచగా హెరాయిన్​డ్రగ్స్​ బయటపడ్డాయి.

అవి పాక్ డ్రోన్ క్వాడ్ కాప్టర్ మోడల్ డీజే1 మాట్రిస్ 300 ఆర్టీకే సిరీస్ అని బీఎస్ఎఫ్ తెలిపింది.మరో ఘటనలో అమృత్​సర్ లోని ఫెన్సింగ్ వద్ద పొలంలో పూడ్చిపెట్టిన రెండు హెరాయిన్ ప్యాకెట్లను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. భరోపాల్ గ్రామంలో కూడా టేపులో చుట్టిన హెరాయిన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో భారత్​లోకి డ్రగ్స్​ని అక్రమంగా పంపించడానికి పాకిస్థాన్​ డ్రోన్లు వినియోగిస్తోంది. ఈ మధ్య కాలంలోనే జమ్మూ కశ్మీర్​, పంజాబ్​ రాష్ట్రాల్లోని పాక్​ సరిహద్దులో పలు డ్రోన్లను జవాన్లు కూల్చేశారు. ఈ పరిణామాలపై సరిహద్దు దళాలు మరింత అప్రమత్తం అయ్యాయి.