Politics

జనసేనలో చేరిన నిర్మాత BVSN ప్రసాద్….

జనసేనలో చేరిన నిర్మాత BVSN ప్రసాద్….

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా తిరుగుతున్న విషయం తెల్సిందే. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాడు. మరో రెండు రోజుల్లో ఆయన వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేన తరుపున ప్రచారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు జనసైనికులు. ఇక మరోపక్క కొత్తవారు జనసేన పార్టీ కండువా కప్పుకొని పవన్ కు తమ మద్దత్తును తెలుపుతున్నారు. తాజాగా జనసేనలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ ఆసక్తితో జనసేనలో చేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జనసేన కార్యాలయంలో పవన్.. BVSN ప్రసాద్ కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వారాహి యాత్రలో పవన్ పక్కనే ఈయన ఉండనున్నట్లు సమాచారం. ఎప్పటినుంచో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారని, పవన్ నిజాయితీ, మంచితనం చూసి వారి పార్టీలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ప్రచార కార్యక్రమాలలో ప్రసాద్ ఎలాంటి వాక్చాతుర్యం చూపిస్తారో చూడాలి.