ఢిల్లీలో టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులను నిషేధిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఊబర్, ర్యాపిడో సంస్థల సర్వీసులకు సంబంధించి సమగ్ర పాలసీని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు వాటి సర్వీసులను నిషేధించింది. కాగా మోటార్ వాహన చట్టానికి వ్యతిరేకంగా టూ వీలర్ వాహనాలను తిప్పుతున్నారంటూ ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేయడంతో ర్యాపిడో సంస్థ కోర్టును ఆశ్రయించింది.