Movies

ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్….

ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్….

అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ఇక గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ తర్వాత బాబుకు జన్మనిచ్చింది. అనంతరం కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీపైనే ఫోకస్ చేసింది. ఇక ఈ మధ్య మళ్లీ సినిమాల్లోకి వచ్చిన ఈ భామ, త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. మరొకవైపు బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె తన తదుపరి చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఇక నిజంగానే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై చందమామ స్పందిస్తే కానీ ఎలాంటి క్లారిటీ రాదు.