NRI-NRT

తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం

తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం

పెన్సిల్వేనియా రాష్ట్రం నారిస్ టౌన్ లో శనివారం నాడు తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే మహాసభలను జయప్రదం చేసేందుకు కార్యాచరణను ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల నుండి మహాసభల కమిటీ సభ్యులు హాజరయ్యారు. కమిటీల పనితీరు, పురోగతి నివేదికలపై అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు కన్వీనర్ రవి పొట్లూరి హర్షం వెలిబుచ్చారు.
 
మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశి కోట, తానా బోర్డు అఫ్ డైరెక్టర్స్ జానీ నిమ్మలపూడి, లక్ష్మి దేవినేని, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, ఫౌండేషన్ ట్రస్టీస్ సుమంత్ రామిశెట్టి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా ప్రాంత ప్రతినిధులు సునీల్ కోగంటి, సాయి బొల్లినేని తదితరులు పాల్గున్నారు.