🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 14.06.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (14-06-2023)
ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఇతరుల బాధ్యతలను కూడా సంతోషంగా పంచుకుంటారు. సుఖ సంతోషాల మీద ఖర్చు చేయడానికి డబ్బుకు లోటు ఉండదు. డాక్టర్లకు, సీఏలకు, లాయర్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా చేతినిండా పని ఉంటుంది. ఆరోగ్యానికి ఏ మాత్రం భంగం కలగదు. అయినప్పటికీ ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడమే మంచిది. దుబారాతో జాగ్రత్త.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (14-06-2023)
సంపాదన పెరగటానికి అవకాశం ఉంది కానీ వ్యయ స్థానంలో గురు, రాహు గ్రహాలు ఉన్నందువల్ల వైద్య ఖర్చులు తప్పనిసరి అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగు ఉండదు. అధికారులు మీ మీద ఎక్కు వగా ఆధారపడతారు. మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. మీరు గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు క్షేమంగా తిరిగి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (14-06-2023)
కుటుంబ సమస్యల మీద, కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం బాగానే ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో కుస్తీ పట్టాల్సి వస్తుంది. మధ్య మధ్య డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సహాయం కోసం ఒకరిద్దరు స్నేహితులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి మంచి కబుర్లు చెవిన పడతాయి. కుటుంబ పెద్దలు మీకు అవసరమైన సహాయం చేస్తారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (14-06-2023)
వృత్తి ఉద్యోగాలపరంగా క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటికి అవసరమైన పనులు కూడా ఎక్కువగానే చేయాల్సి వస్తుంది. ఆదాయం పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. కొద్దిగా పొదుపు చేసే అవకాశం కూడా ఉంది. డబ్బు తీసుకున్న వారు సకాలంలో తిరిగి ఇవ్వకపోవచ్చు. డబ్బు ఇచ్చిన వారు మాత్రం ఒత్తిడి తెస్తూనే ఉంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో నాలుగు డబ్బులు కనిపిస్తాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (14-06-2023)
ఉద్యోగంలో అధికారులు మీ మంచితనాన్ని గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన సామాన్యంగా ఉంటుంది. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. చదువు సంధ్యలు పూర్తయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థికంగా సహకారం లభిస్తుంది. ఎవరికి చెప్పుకోలేని వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (14-06-2023)
ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కాస్తంత పురోగతి కనిపిస్తోంది. ఆదాయం పెరిగి విలాసాల మీద దృష్టి పడుతుంది. ఉద్యోగం లోనే కాకుండా వృత్తి, వ్యాపారాలలో కూడా సంపాదన పెరగటం ఖాయం అని చెప్పవచ్చు. ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. పిల్లల ద్వారా శుభవార్తలు వినడం జరుగుతుంది. గతంలో మీరు తీసుకున్న మంచి నిర్ణయాలు చేసిన గట్టి ప్రయత్నాలు ఇప్పుడు మీరు ఆశించిన ఫలితాలను ఇస్తాయి.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (14-06-2023)
ఉద్యోగ జీవితం చీకూ చింతా లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీరు అనుకున్నట్టుగానే పనులన్నీ పూర్తి అవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయం పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగానే ఉంటుంది. ఖర్చులు మాత్రం చేయి దాటిపోయే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా రెండు మూడు మార్గాలలో మీ చేతికి డబ్బు అందే సూచనలు కనిపిస్తున్నాయి.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (14-06-2023)
ఆర్థిక పరిస్థితి పరవాలేదు అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు కూడా ఉండవద్దు. మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. స్నేహితుల వల్ల కొద్దిగా ప్రయోజనం కనిపిస్తుంది
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (14-06-2023)
ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగటానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితికి మీ ఆర్థిక పరిస్థితి చేరుకుంటుంది. ఉద్యో గంలో గౌరవ అభిమానాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఎవరి విషయాలలోనూ కల్పించుకోకపోవడం శ్రేయస్కరం. సంతానంలో ఒకరు చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (14-06-2023)
ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అదనపు సంపాదన కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (14-06-2023)
ఉద్యోగంలో మీ ప్రతిభ పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా విభేదాలు అపార్ధాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మాటలు చేతల విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మనశ్శాంతికి అంత మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం లభించవచ్చు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (14-06-2023)
ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలోనే దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు చదువుల విషయంలో పురోగతి చెందే అవకాశం ఉంది.
🦈🦈🦈🦈🦈🦈🦈