DailyDose

కోల్‌కతా ఎయిర్ పోర్టులో అగ్ని ప్రమాదం….

కోల్‌కతా ఎయిర్ పోర్టులో అగ్ని ప్రమాదం….

కోల్‌కతాలోని నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి డిపార్చర్‌ గేటు సమీపంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 9.10 గంటల సమయంలో మంటలను గుర్తించామని, అరగంటలోపే ఆర్పేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, విమానాల రాకపోకలకూ అంతరాయం కలగలేదని చెప్పారు. 3సీ డిపార్చర్‌ గేటు సమీపంలో మంటలు రావడంతో విమానాశ్రయమంతా నల్లటి పొగ కమ్మేసిందన్నారు. పొగ అలుముకోవడంతో కొద్దిసేపు చెక్‌-ఇన్‌ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిపారు. అగ్నిప్రమాదం ఘటన దురదృష్టకరమన్న పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అదృష్టవశాత్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని ట్వీట్‌ చేశారు.