Agriculture

ఇవాళ నుంచి జి 20 వ్యవసాయ మంత్రుల సమావేశం…..

ఇవాళ నుంచి జి 20 వ్యవసాయ మంత్రుల  సమావేశం…..

అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ (ఎడబ్ల్యూజీ) మినిస్టీరియల్ సమావేశాలకు హైదరాబాద్ సిద్ధం అయింది. 2023 జూన్ 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల డైరెక్టర్స్ జనరల్ పాల్గొంటారు.

మొదటి రోజు, గౌరవ కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ఒక ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు. ప్రారంభోత్సవం అనంతరం వ్యవసాయ డిప్యూటీస్ మీటింగ్ (ఏడీఎం) జరుగనుంది. ద్వితీయార్ధంలో అగ్రిబిజినెస్ ఫర్ ప్రాఫిట్, పీపుల్ అండ్ ప్లానెట్ నిర్వహణ, డిజిటల్లీ డిస్కనెక్ట్: వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతల శక్తిని ఉపయోగించుకోవడం’ అనే రెండు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వ్యవసాయ వాణిజ్య కంపెనీలను ప్రోత్సహించడంలో అగ్రశ్రేణి భారతీయ వ్యవసాయ ఆధారిత కంపెనీలు, స్టార్టప్‌లు , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఉంటుంది.

రెండవ రోజు సమావేశం గౌరవ కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, జి 20 సమావేశంలో పాల్గొనే మంత్రులు,ఇతర ప్రతినిధి బృందాల నాయకులకు స్వాగతం పలకడంతో ప్రారంభమవుతుంది. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, మహిళల నేతృత్వంలోని వ్యవసాయం, సుస్థిర జీవవైవిధ్యం, వాతావరణ పరిష్కారాలపై ఉన్నత స్థాయి మంత్రుల చర్చలు మూడు సమాంతర సెషన్లలో జరుగుతాయి.

మూడవ రోజు భారత్ అధ్యక్షతన అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, జి 20 ఫలితాలను ఆమోదించడంతో మంత్రుల సమావేశం ముగుస్తుంది. అనంతరం ప్రతినిధి వర్గం హైదరాబాద్ లోని ఐసీఏఆర్ -ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్ )కు సాంకేతిక విజ్ఞాన యాత్రకు వెళతారు.