మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహా అనే వ్యక్తి 62 ఏళ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. గోవింద్ భార్య హీరాబాయి కుష్వాహా (30) మంగళవారం ఉదయం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువుల ఆరోగ్యం బలహీనంగా ఉండడంతో వారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తమకు పుట్టిన కుమారుడు మరణించడం వల్ల గోవింద్ కు మొదటి భార్యే మళ్లీ పెళ్లి చేయించింది.
62వ ఏటా ముగ్గురు పిల్లలకు తండ్రి…
