NRI-NRT

యార్లగడ్డకు మరో జాతీయ పురస్కారం

యార్లగడ్డకు మరో జాతీయ పురస్కారం

పద్మశ్రీ, పద్మభూషణ్, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను మరో జాతీయ పురస్కారం వరించింది. ప్రముఖ తెలుగు, హిందీ రచయిత. పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను మరో విశిష్ట జాతీయ పురస్కారం వరించింది. వారణాసి (కాశీ) కేంద్రంగా హిందీ భాషాభివృద్దికి జాతీయ స్దాయిలో కృషి చేస్తున్న నాంది సేవా ట్రస్ట్ , నాంది పత్రిక ప్రతి సంవత్సరం అందించే పురస్కారాలలో భాగంగా “ రాజేంద్రస్కృతి ” జాతీయ పురస్కారాన్ని యార్లగడ్డకు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన వారణాసిలో జరిగే ప్రత్యేక వార్షిక సమ్మేళనంలో అచార్య యార్లగడ్డ భాషా కోవిదుల చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ అవార్డులో భాగంగా నాంది సేవా ట్రస్ట్ లక్ష్మి ప్రసాద్ కు లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం అందించనుంది. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ తెలుగు సాహిత్యంపై కీలక ప్రసంగం చేస్తారని ట్రస్ట్ అధ్యక్షురాలు శశికళా పాండే ఒక ప్రకటనలో తెలిపారు.