కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు కులం పేరిట ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. వైసీపీ పార్టీ అందరినీ సమానంగా చూస్తుందని చెప్పారు. ‘కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము – ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. విపక్ష నాయకులు తాము ఫలానా కులానికి చెందిన వారమని…కాబట్టి ఆ కులం వారంతా గంపగుత్తగా తమకే ఓటు వేయాలని మైకులు పట్టుకొని మీద పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం కులం, మతం, వర్గం, పార్టీ, ప్రాంతం చూడదు…అందరినీ సమంగా ఆదరిస్తుంది’ అని విజయసాయి ట్వీట్ చేశారు.
వైసీపీ కులం, మతం చూడదు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు….
