చంద్రబాబు పేదల వ్యతిరేకి సీఎం జగన్,మూడుసార్లు సీఎం అయిన చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా మంచి చేశారా?మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు.మరోసారి ఛాన్స్ ఇవ్వాలంటున్న బాబు అప్పుడు ఏం చేశారు?మంచి చేశాను కాబట్టి ఓటు వేయండి అని అడగడం లేదు. ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబు దగ్గర లేదు.
టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరుపై అప్పుగా రాశారు.పేదలు నెలకు రూ. 3వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలన్నారు. ఈ ప్రభుత్వం 300 చ.అ ఇళ్లను రూపాయికే అందిస్తోంది.చంద్రబాబు తాను చేయని పని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు.అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు.సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలను ఇవ్వగలిగాం.