NRI-NRT

చైనా సరికొత్త రికార్డు

చైనా సరికొత్త రికార్డు

ఒకేసారి 41 ఉపగ్రహాలను ప్రయోగించింది. లాంగ్‌ మార్చ్‌ 2డీ రాకెట్‌ ద్వారా 41 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఈ ప్రయోగంతో చైనా కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే మిషన్‌లో 41ఉపగ్రహాలను పంపడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయువన్‌ శాటిలైట్‌ లాంచ్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ సిరీస్‌లో ఇది 476వ ఫ్లయిట్‌ మిషన్‌ కావడం విశేషం. చైనా ప్రయోగించిన శాటిలైట్లు.. కమర్షియల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సర్వీసులను కల్పించనున్నాయి. ఆ శాటిలైట్లలో 36 జిలిన్‌-1 సిరీస్‌కు చెందినవి. ఇప్పటి వరకు చైనా మొత్తం 108 జిలిన్‌-1 శాలిలైట్లను ప్రయోగించింది. తొలిసారి జిలిన్‌-1 శాటిలైట్‌ను 2015లో చైనా ప్రయోగించింది. ఆ శాటిలైట్‌ బరువు సుమారు 420 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం ఆ శాటిలైట్ల బరువు కేవలం 22 కిలోలు మాత్రమే. కొన్ని రోజుల క్రితమే చైనా ముగ్గురు వ్యోమగాముల్ని స్పేస్‌ స్టేషన్‌కు పంపింది.