WorldWonders

విస్కీ బాటిళ్లలో కొకైన్ కరిగించి అక్రమ రవాణా

విస్కీ బాటిళ్లలో కొకైన్ కరిగించి అక్రమ రవాణా

25 ఏళ్ల కెన్యా మహిళ తన వద్ద ఉన్న రెండు విస్కీ బాటిళ్లలో కొకైన్‌ను కరిగించి అక్రమ రవాణా చేస్తున్నందుకు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు సీనియర్ కస్టమ్స్ అధికారి శుక్రవారం తెలిపారు. నిందితురాలు గురువారం అడిస్ అబాబా నుంచి వచ్చిన తర్వాత ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డగించారు. ఆమె నుండి సుమారు రూ. 13 కోట్ల విలువైన కొకైన్‌తో కూడిన రెండు విస్కీ సీసాలు రికవరీ అయినట్లు అధికారి తెలిపారు. ఆమెను అరెస్టు చేసి కొకైన్‌తో కూడిన విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు